రైతులకు నష్టపరిహారం పెంచాలి: బొర్రా

సత్తెనపల్లి: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలో అరటితోట, జామతోట, మిరప మించౌంగ్ తుఫాన్ కు నేలమట్టమయ్యాయని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా బొర్రా రైతుని హార్టికల్చర్, వ్యవసాయ అధికారులు కానీ, కనీసం వాలంటీర్లు పంట నష్టం అంచనా వేయవచ్చు. ఇప్పటికైనా మంత్రి రాంబాబు వ్యవసాయ అధికారులు పంపించి సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపించాలి. హెక్టర్ కు 2000 సహాయం ప్రకటించారు. అరటి చెట్లు నిలబెట్టిన కూలి మనిషికి వెయ్యి రూపాయల కూలి కావాలి. పంట నష్టం గురించి సరైన నివేదిక తయారు చేసి వారికి తగిన నష్టపరిహారం ఇప్పించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు కమిటీ వారు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.