పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

విజయనగరం: ఝాన్సి వీరమహిళా విభాగం ఉత్తరాంధ్ర మహిళ రీజనల్ కో ఆర్డినేటర్ ఆధ్వర్యంలో జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫిస్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజీనావాపై కొందరు వైసీపీ వారు సోషల్ మీడియా ద్వారా చేసిన అసాంఘిక వ్యాఖ్యలను ఖండిస్తూ.. పోలీసు వారికి అలాగే డి.ఎస్.పికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుర్యోధన దుశ్శాసనుల లాంటి వైసీపీ నేతలను చట్ట ప్రకారం శిక్షించాలని. ఆడవాళ్ళను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే నీచ బుద్ది మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం నాయుకులు మాధవి లోకం, డెంకడ మండల అధ్యక్షులు పతివాడ కృష్ణవేణి, మెరక ముడిధం మండల అద్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు, వీరమహిళా నాయుకులు మాత గాయత్రి, గంట్లన పుష్ప కుమారి, సరిత, రుక్మిణి, నారాయణమ్మ, లీగల్ సెల్ సుబ్రమణ్యం, జనసేన నాయికులు చక్రవర్తి యర్ణగుల, కొయ్యన రామకృష్ణ, సైలాడ అనిల్ తదిదరులు పాల్గొన్నారు.