ప్రాధమిక పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన

దర్శిపర్రు గ్రామ పంచాయతీలోని బిల్లగుంట గ్రామంలో ప్రాధమిక పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు MEO, గ్రామ సర్పంచ్ శ్రీమతి కోలా శేషవేణి, ఉపసర్పంచ్ శ్రీ కోలా మార్కండేయులు, గ్రామ MPTC శ్రీ తోట నిరీక్షణరావు, వార్డు మెంబర్లు, తెలుగుదేశం నాయకులు శ్రీ కోడే కాళి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం జనసేన పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు 10 లక్షల రూపాయలు నరసాపురం MP నిధుల నుండి కేటాయించడం జరిగిందని, అలాగే పాఠశాల నిర్మాణం అతి వేగంగా పూర్తిచేసి బిల్లగుంట గ్రామ విద్యార్థులకు 40 సంవత్సరాలుగా ఉన్న సమస్యను తీరుస్తామని తెలిపారు. ంఫ్ట్ఛ్ మాట్లాడుతూ ఈ పాఠశాల నిర్మాణం తొందరగా పూర్తయి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉపసర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది విషయంలో ఎక్కడా రాజీ పడబోమని, ఎన్నికల సందర్భముగా ఇచ్చిన హామీని నేరవేర్చినందుకు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ కి స్కూల్ నిర్మాణానికి నిధులు కేటాయించిన MP కి కృతజ్ఞతలు తెలియచేసారు.