భవ్యశ్రీకి న్యాయం జరగాలంటూ కొవ్వొత్తులతో జనసేన నిరసన

  • భవ్యశ్రీకి న్యాయం జరిగే వరకు జనసేన వీరమహిళా విభాగం తరుపున ఎటువంటి పోరాటలకు అయినా సిద్ధం

చిలకలూరిపేట: చిత్తూరు జిల్లాలో వేణుగోపాల పురంలో మునికృష్ణ పద్మ దంపతుల 16 ఏళ్ల కుమార్తెపై జరిగిన మానవ మృఘాల అఘాత్యాన్ని నిరసిస్తూ చిలకలూరిపేట జనసేన పార్టీ తరుపున నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి ఆధ్వర్యంలో వీరమహిళలు మరియు జనసేన నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో భాగంగా రాజ్యాంగ కర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహంనకు, మరియు మదర్ థెరిస్సా విగ్రహాల వద్ద పూల మాలలు వేసి, కాండిల్ వెలిగించి చనిపోయిన ఆ పాప కుటుంబానికి నిష్పక్షపాతంగా దోషులను కఠినంగా శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పెంటేల బాలాజి మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఉన్నప్పటికీ స్పందించాకపోవటం బాధాకరం అని అన్నారు. చీటికీ మాటికీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబంపై వ్యక్తి గత విమర్శలు చేయటం తప్ప మంత్రి రోజా గారు, మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ, విడదల రజని, హోమ్ మంత్రి తానేటి వనిత మహిళలపై, ఆడ పిల్లలపై జరిగే అఘాత్యాలు మాత్రం కనపడవు అని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో నేషనల్ హైవే పై గత నాలుగు సంవత్సరాలనుండి సుమారు 400 మందికి పైగా ప్రమాదాలకు గురయ్యారు, అలానే 150 మందికి పైగా మరణింంచడం జరిగింది. గత వారంలో రోడ్డు ప్రమాదంలో ముక్కుపాచ్చాలారని ఒక విద్యార్థి, మరొక విద్యార్థిని ప్రమాదంలో మరణింంచడం జరిగింది. మరణింంచిన విద్యార్థి తల్లి దండ్రులు అతని అవయావాలని దానం చేసి మానవత్వం చాటుకున్నారు. అయినప్పటికి వైద్య విద్యా శాఖ మంత్రి విడదల రజని గారికి కనువిప్పు కలగపోవటం ప్రజల ప్రాణాలపై వారికి వున్న చిత్త శుద్ధి కనపడుతుంది అని విమర్శించారు. వీరమహిళ అమరేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 30000 మంది ఆడపిల్లలు, మహిళలు కనిపించకుండా పోయినా పసి పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వైస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని, పవన్ అన్నను గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళలపై ఏదయినా అఘాయిత్యం జరిగితే ఒక్క ఘంట సమయంలోపే వారిని కఠినంగా శిక్ష విధించేలా చేస్తామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారని భవ్య శ్రీ కి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వీరమహిళా విభాగం తరుపున ఎటువంటి పోరాటలకు అయినా సిద్ధం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు చెమిటిగంటి అమరేశ్వరి, మల్లిక, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి ఎల్ బి నాయుడు, నాదెండ్ల మండల అధ్యక్షులు కొసన పిచ్చయ్య, మండల నాయకులు దుర్గా ప్రసాద్, చిలకలూరిపేట మండల నాయకులు తిమ్మిశెట్టి కోటేశ్వరరావు, యడ్లపాడు మండల ఉపాధ్యక్షులు మల్లా కోటి, యడ్లపాడు మండల కార్యదర్శి సుభాష్, పట్టణ నాయకులు అచ్చుకోల అరుణ్, పగడాల, తోటకూర అనిల్, గోవిందు గణపతి, సిద్దు, సాయి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.