అర్బన్ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన

గుంటూరు నగరపాలక సంస్థలోని 16వ డివిజన్, ఏటుకూరు గ్రామంలో గౌరవనియులు మాజీ రాష్ట్ర హోంశాఖ మాత్యులు మేకతోటి సుచరిత, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర కమిషనర్ ల సహకారంతో సోమవారం 16 వ డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ మరియు గ్రామ పెద్దలు కలిసి అర్బన్ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏటుకూరు గ్రామ ప్రజలు, నాయకులు, సంబంధిత మునిసిపల్ అధికారులు పాల్గొనడం జరిగినది.