రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో జనసేన నేత చేగొండి

ఆచంట: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కొణిదల నాగబాబు పిలుపు మేరకు శుక్రవారం ఆచంట నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాశ్ పోడూరు మండలం, మినిమించిలిపాడు గ్రామంలో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం, రైతు కుటుంబాల సంక్షేమం కోసం పరితపిస్తున్న విధానం గురించి, అలాగే 3000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం గురించి రైతులకు వివరించడం జరిగింది. అలాగే మినిమించిలిపాడు గ్రామంలో ఎస్సీ పెద్దపేట కాలనీలో ఉన్న ప్రజల సమస్యలను చేగొండి సూర్యప్రకాష్ స్వయంగా అడిగి తెలుసుకుని వారి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారికి తెలియచేయడం జరిగింది. అనంతరం పెద్దపేట కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోడూరు మండల అధ్యక్షులు గుడాల రాజేష్, ఆచంట మండల అధ్యక్షులు జవ్వాది బాలాజీ, పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రావి హరీష్, ముక్కే గోవింద రాజు, గొల్లమందుల నాగరాజు, పోట్టి రమేష్, తోలేటి వేణుగోపాల్, పల్లేరు నాగేశ్వరరావు, మాండ్రు జయకుమార్, కోర దొరబాబు, చెల్లే ప్రవీణ్ ఆచంట ఎంపీటీసీ దాసిరెడ్డి పద్మావతి, నంబూరి విజయ్, నిమ్మన శేఖర్, కడలి శ్రీను సింగంసెట్టి నాగేశ్వరరావు, కొడేరు గ్రామ అధ్యక్షుడు కుంపట్ల రమేష్, వల్లూరు గ్రామ అధ్యక్షుడు కడిమి ఉమ, ఆచంట మండల నాయకులు తోట ఆదినారాయణ, పెనుగొండ జనసేన నాయకులు తోట సతీష్, ఏడిద సాయితేజ, ఆచంట మండల నాయకులు సళ్ళది పెద్దిరాజు, గోకరాజు విశ్వతేజ, చింతలతోట ప్రసాద్, చెల్లింకల నాగరాజు, చిట్టూరి సత్యనారాయణ, కురసాల నాయుడు, బండారు నాగేంద్ర, పెనుమంట్ర మండల జనసేన నాయకులు అడ్డాల సత్యనారాయణ, అడ్డాల నవీన్, జనసైనికులు పాల్గొన్నారు.