వినతిపత్రం ఇస్తామంటే అనుమతించరు సమస్యలు ప్రస్తావిస్తే అక్రమ కేసులు

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, ప్రభుత్వం ‌ఏర్పడిన నాటి నుండి పరిష్కారానికి నోచుకోని సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడానికి జిల్లా అధికారుల అనుమతి కోరితే ఇవ్వకపోవడం దురదృష్టకరమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కుప్పం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి జిల్లాలో నెలకొన్న సమస్యలు జనసేన పార్టీ తరఫున తీసుకెళ్లాలని‌ జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వంలో అధికారుల అనుమతి కోరితే ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. ‌ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలలో అభివృద్ధి మదగించిందన్నారు.‌‌ మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు చేశారు. మదనపల్లె ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా విఫలమయ్యారని, మదనపల్లె జిల్లా కేంద్రంపై ఎటువంటి పోరాటం చేయకుండా రాయచోటికి అప్పగించాడని ఎద్దేవా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ మదనపల్లె దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన గుట్టకిందపల్లి, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ‌పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్నారు. ‌మరోవైపు భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేయకుండా ఇచ్చిన మాట తప్పారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, ఐటి విభాగం అధ్యక్షులు జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ కార్యదర్శిరెడ్డెమ్మ, జిల్లా కార్యదర్శి సనావుల్లా, రూరల్ మండలం కార్యదర్శి గండికోట లోకేష్, నవీన్, శంకర్, శ్రీనివాసులు, బాబి, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.