కాలువల నిర్మాణం చేపట్టాలి: జనసేన నాయకుల డిమాండ్

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం గ్రామంలో కెల్లా వీదిలో మంచినీరు కోలాయి దగ్గర కాలువ లేక అక్కడే నీరు నిల్వ ఉంటుంది. కాపువీదిలో కూడా నీరు అక్కడే నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండడం వలన దోమలు విపరీతంగా క్రిమికీటకాలు ఎక్కువై.. చుట్టుపక్కల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు వీపరీతంగా విషజ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కాలువలు నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు మరియు నడుపూరు శంకరరావు డిమాండ్ చేశారు. చెయ్యని యెడల తివ్రస్ధాయిలో కలెక్టర్ దృష్టికి తాసిల్దార్ దృష్టి కి తీసుకు వెళ్తామని తెలియజేసారు.