ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం ఆపాలి: రామ శ్రీనివాస్

  • రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన నేత రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భారతకమ్యూనిస్టు వారు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన నేత రామ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగ రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎగువ భద్ర ప్రాజెక్టు నిర్మాణ పనులు తక్షణం ఆపాలని లేనిచో రాయలసీమ వ్యాప్తంగా రైతులు మరియు ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. రైతు సంఘం నేతలు, అఖిలపక్ష పార్టీ నాయకులు అందరూ కలిసి ఎగువ భద్ర ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వెంటనే నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ తో రాయలసీమ-ఎడారే అనే అంశంపై అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంకు పలువురు నేతలు కేంద్రం వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల పట్ల మొదటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపేనని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నేడు ఈ దుస్థితి తలెత్తే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ప్రతి సంవత్సరం అర కొరా నిధులు విదిలిస్తూ మరోవైపు ప్రక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో 5300 కోట్లు రూపాయలు కేటాయించి జాతీయ ప్రాజెక్టుగా పేర్కొనడం దుర్మార్గమన్నారు. కేంద్ర జలవనరుల సంఘం, న్యాయపరమైన అనుమతులు లేకున్నా, కేంద్రం ఏకపక్షంగా జాతీయ ప్రాజెక్టుగా పేర్కొనడం కర్ణాటకలో బిజెపి గెలుపొందాలని కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమతో సహా నెల్లూరు, ప్రకాశం, జిల్లాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని, రాయలసీమ పూర్తి ఎడారిగా మారుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు సైతం 75% పక్కదారి పడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నేతలు, రైతుసంగాలు, రైతులు, ప్రజాసంఘాలు నాయకులు, మహిళా సంగం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.