కాపీ సీఎం – సెల్ఫీ సీఎం

వర్క్ ఫ్రం హోమ్ సీఎం

తప్పుడు హామీలు ఇచ్చి తప్పించుకున్న సీఎం

శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ

ఇది ప్రకృతి విపత్తు కాదు.. ఎమ్మెల్యేల భూదాహమేనని, ఈ వరదల్లో వచ్చిన ఇసుక అమ్మకం ద్వారా వచ్చే రాబడిని ఆ ప్రాంత నిరాశ్రయులకు పంచండని, రాష్ట్ర ప్రజలు హామీలను ప్రశ్నిస్తారనే సీఎం రాజధానికే పరిమితమయ్యారని, వైసిపివి హెలికాప్టర్ (కాకి) లెక్కలు మాత్రమే అని అన్నారు.

తమ వద్ద కన్నీటితో కూడిన… వరదలో కొట్టుకుపోయిన వారి భారీ లెక్కలు, ఆధారాలతో ఉన్నాయి, మా జనసేనాని ప్రభుత్వ తప్పుడు లెక్కల గుట్టు పై పోరాడతారు. తమ జనసేనతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు తుఫాన్ బాధితులకు సాయం అందించారు. వైకాపా ముంపు ప్రాంతాలలో సాయం అందించడంలో విఫలమైంది. తమ నేత నాదెండ్ల మనోహర్ ఎక్కడ తిరిగారో సీఎం అదే ప్రాంతాల్లో పర్యటించారు, అందుకే కాపీ సీఎం అని అనాల్సి వస్తుందని అన్నారు.

టిటిడి ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వారి సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తుంటే… వీరిని సీఎం పలకరించక పోవడం బాధాకరమని
ఇటీవల రాయలసీమలో కురిసిన భారీ తుఫాన్ వరద ప్రవాహంలో ఇల్లు సైతం కొట్టుకుపోవడానికి కారణం… కడప జిల్లాలోని రాజంపేట ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఎమ్మెల్యేల చెరువుల కబ్జా భూదాహమే, కారణమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నగర ఇన్చార్జ్ కిరణ్ రాయల్ లు ఆరోపించారు.

ప్రెస్ క్లబ్ శనివారం మీడియాతో జనసేన నేతలు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, హేమకుమార్, మునస్వామి, ఆనంద్, మనోజ్, బాల తదితరులతో కలసి వీరు మాట్లాడుతూ… వైసిపి పాలనలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ధన దాహంతో భూకబ్జాలు, ప్రభుత్వ కార్యాలయాలలో లంచాలు, అవినీతి దోపిడీ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్లనే వరదలు వచ్చినప్పుడు చెరువులు లేక ఆ నీటి ప్రవాహాలు, నగరాలపై ప్రవహించి, చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర విపత్తు జరిగి, ఎందరో పేద ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు . దీనిపై వైకాపా ప్రభుత్వం కాకిలెక్కలు ప్రకటించి, నమ్మి ఓటు వేసిన వారికి న్యాయం చేయలేక పోతున్నదని విమర్శించారు. మల్లెమడుగు, కళ్యాణి డ్యాంల గేట్లు సకాలంలో ఎత్తుక పోవడానికి కారణం ఇసుక అక్రమ రవాణానేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఘోర విపత్తుపై సేకరించిన అసలైన లెక్కలను పరిశీలించి నిరాశ్రయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కడప, చిత్తూరు జిల్లాల ముంపు ప్రాంతాల, పర్యటనలో సీఎం జగన్ దుక్కిఒచ్చాల్సిన, చోట సెల్ఫీలతో ఆనందించారని ఎద్దేవా చేశారు . కరోనా పుణ్యమా, వర్క్ ఫ్రం హోమ్ తో అందరినీ సోంబేరిలను చేసి కోవిడ్ తగ్గినా కూడా నేడు అదే కోణంలో జగన్ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారన్నారు.