కుంభమేళాలో కరోనా ఉధృతి.. రెండు రోజుల్లో 1000 పాజిటివ్‌ కేసులు..

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు హాజరవుతున్న సంగతి తెలిసిందే. పరీక్షలు నిర్వహించగా రెండు రోజుల్లో వెయ్యి మంది యాత్రికులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. సోమవారం 408 కేసులు నమోదుకాగా, మంగళవారం 594 కరోనా కేసులు నమోదయ్యాయి. లక్షలాది మంది యాత్రికులు వస్తున్నప్పటికీ.. కొంత మందికే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాత్రికులు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోమవారం 28 లక్షల మంది మేళాకు హాజరైనట్లు సమాచారం.