కమల్ నాథ్ కు సుప్రీం ఊరట.. ఆ అధికారం ఈసీకి లేదు

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌ నాథ్ ‘స్టార్ క్యాంపెయినర్’ హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు ‘స్టే’ విధించింది. ఎన్నికల ప్రచాంలో భాగంగా అక్టోబర్ 13న సీఎం శివరాజ్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు, అక్టోబర్ 18న బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవిపై చేసిన వాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. దీంతో కమల్ నాథ్ ను స్టార్ ప్రచారకుడిగా హోదాను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 30న ఎన్నికల కమిషన్ పేర్కొంది. దీనిపై కమల్ నాథ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రత్వంలో త్రిసభ్య కమిటి ఆయన పిటిషన్ ను విచారించింది. కమలనాథ్ తరుపున న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ఎన్నికల కమిషన్ తరుపున రాకేశ్ ద్వివేది హాజరయ్యారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు కమలనాథ్ స్టార్ క్యాంపెయిన్ హోదాను రద్దు చేసే అధికారి ఈసీకి లేదని తెలిపింది.