కరోనా విపత్కర సమయంలో బాద్యతారహితంగా పాఠశాలలను నడపడం ఖండించిన కీర్తన

చిత్తూరు, ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లక్షల విద్యార్థులతో పాటు వారి కుటుంబాలనూ కరోనా ముప్పులోకి నెట్టే విధంగా పాఠశాలల్లో తరగతులను కొనసాగిస్తూ, మొండి వైఖరితో బాధ్యతా రాహిత్యాన్ని అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోవిడ్ ఉధృతి తగ్గే వరకూ తరగతులను వాయిదా వేయాలని చిత్తూరు జిల్లా జనసేన పార్టి జాయింట్ సెక్రటరి కీర్తన తీవ్రంగా ఖండించారు. 20 శాతం మించి పాసిటివ్ రేటు ఉన్నపుడు ఎలా నడుపుతున్నారని..? పాఠశాలల్లో సామాజిక దూరం పాటించట్లేదని, కరోన వ్యాప్తి చెందకుండా ఏ విధమైన చర్యలు లేకుండా పాఠశాలలు నడుపుతున్నారని తీవ్ర ఆవెదనన్ వ్యక్తం చేసారు. కేసులు తగ్గుముఖం పడితే మరల పాఠశాలలు తిరిగి తెరవచ్చని అన్నారు.