సింగరేణి ‘లా’ విభాగంలో ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ తన ‘లా’ విభాగంలో రెండు డిప్యూటీ లా మేనేజర్‌ పోస్టులకు, రెండు సీనియర్‌ లా ఆఫీసర్‌ పోస్టులకు అనుభవం ఉన్న (లేటరల్‌ ఎంట్రీ) వారిని నియమించడం కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది.

విద్యార్హత:

డిప్యూటీ లా మేనేజర్‌ పోస్టుకు ఎల్‌.ఎల్‌.బి./ బి.ఎల్‌. 60 శాతం మార్కుతో పాసైన ఫుల్‌ టైమ్‌ రెగ్యులర్‌ డిగ్రీ అభ్యర్ధులు 12 సం॥ పాటు డిగ్రీ అనంతర లీగల్‌ ప్రాక్టీషనర్‌ గా పని చేసిన అనుభవం ఉండాలి.

సీనియర్‌ లా ఆఫీసర్‌ పోస్టులకు ఎల్‌.ఎల్‌.బి./ బి.ఎల్‌. 60 శాతం మార్కులతో పాసైన ఫుల్‌ టైమ్‌ రెగ్యులర్‌ డిగ్రీ అభ్యర్ధులు అర్హులు. ఎల్‌.ఎల్‌.ఎమ్‌. పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వవబడును.

దరఖాస్తు విధానం: ఆన్‌ లైన్‌ ద్వారా

ద‌ర‌ఖాస్తుకు ప్రారంభ తేది: డిసెంబర్‌ 5, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 12, 2020

పూర్తి వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌ https://scclmines.com/ ”careers”