20 రోజుల్లో 10 వేల మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌

డెహ్రాడూన్‌: హిమాలయ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చిన్నారులపై ప్రతాపం చూపిస్తున్నది. కేవలం ఇరవై రోజుల్లోనే పది వేలకుపైగా బాలలు కరోనా బారినపడ్డారు. స్టేట్ కొవిడ్ కంట్రోల్ రూమ్ గణాంకాల ప్రకారం.. మే 1 నుంచి 20 మధ్య 9 ఏండ్లలోపు చిన్నారులు 2044 మందికి కరోనా సోకింది. అదేవిధంగా 10 నుంచి 19 ఏండ్ల టీనేజర్లు 8661 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలో గత 20 రోజుల్లో 1,22,949 మందికి మహమ్మారి సోకిందని తెలిపింది.

కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 3626 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,566కి చేరింది. ఇందులో 63,373 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,38,593 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5600 మంది కరోనా వల్ల మరణించారు.