ఫిబ్రవరి నాటికి కరోనా థర్డ్ వేవ్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను గజగజలాడిస్తుంది. భారత్ లో కూడా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తిపై పలు అంచనాలు బయటకు వస్తున్నాయి.

భారత్ లో కరోనా థర్డ్ వేవ్ ఉంటుందని.. ఒమిక్రాన్ రూపంలోనే అది ప్రజలపై పడగెత్తుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఐఐటీ సైంటిస్ట్ మనీంద్ర అగర్వాల్ మ్యాథ్ మెటికల్ ప్రొజెక్షన్ లో చేసిన ఈ అధ్యయనంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి నాటికి పీక్స్ కు చేరుకుంటుందని తేలింది. అయితే, సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని.. పీక్స్ లో ఉన్నప్పుడు రోజుకు 1 నుంచి 1.5 లక్షల మధ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని మనీంద్ర అగర్వాల్ తెలిపారు.