2021 ఏప్రిల్ నాటికి అమెరికన్లందరికీ కరోనా వ్యాక్సిన్

రాబోయే 2021, ఏప్రిల్ నాటికి దేశంలోని ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు రాగానే ప్రభుత్వం అమెరికన్లందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతుందని చెప్పారు.

అమెరికాలోని వైద్యశాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వీలైనంత త్వరగా టీకా తీసుకురావాల్సిన అవసరం ఉందని, అప్పుడే జనజీవనాన్ని పట్టాలపైకి తీసుకురాగలుగుతామని అన్నారు. ఒక టీకా ద్వారా కోట్లాదిమంది జీవితాలను రక్షించగలుగుతామని, వ్యాక్సిన్ తయారీ అనేది తమ ముందున్న ప్రధమ కర్తవ్యమని అన్నారు. వ్యాక్సిన్‌కు అనుమతి లభించిన 24 గంటల్లో దానిని పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు. వచ్చే ఏప్రిల్‌నాటికి అమెరికన్లందరికి తగిన మోతాదులో వ్యాక్సిన్ లభ్యమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్‌కు అనుమతి లభించిన 24 గంటల్లో దానిని పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు.