థామస్ కప్ విజేత సాత్విక్ సాయిరాజ్ ను సత్కరించిన కౌన్సిలర్ గొలకొటి

కోనసీమ జిల్లా, భారత కీర్తిని నలుదిశలా చాటి చెప్పి థామస్ కప్ గెలుచుకుని తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సాత్విక్ సాయిరాజ్ ను కోనసీమ జిల్లా అమలాపురం ఆయన స్వగృహంలో అమలాపురం పురపాలక సంఘ జనసేన 9 వ వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి-వీర వెంకట సత్యనారాయణ (వాసు) దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాత్విక్ సాయి రాజ్ కు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించి, అభినందించారు. ఈసందర్బంగా కౌన్సిలర్ విజయలక్ష్మి దంపతులు సాత్విక్ సాయిరాజ్ షటిల్ బాడ్మింటన్ లో అద్భుత క్రీడాప్రతిభతో భారత్ ను గెలిపించినందుకు అభినందనలు తెలిపారు. సాత్విక్ సాయిరాజ్ తల్లి తండ్రులు రంగమణి, కాశీవిశ్వనాధంలను అభినందించారు.