క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్.. సర్జరీ చేసిన వైద్యులు!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను చేర్పించగా.. వెంటనే స్పందించిన యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. 61 ఏళ్ల కపిల్ దేవ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు.

కపిల్‌దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలియగానే సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. భారత్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.