WWE స్టార్‌ ల్యూక్ హార్పర్‌ హఠాన్మరణం

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన షోలు చూసే వారికి ‘ల్యూక్ హార్పర్’  సుపరిచితమే. ఎన్నో ఈవెంట్స్ లో అందరినీ అలరించాడు. అటువంటి వ్యక్తి ఇక లేరు. లూక్ హార్పర్‌, బ్రాడి లీగా పేరొందిన అమెరికా ప్రొఫెషనల్ రెజ్లర్ జొనాథన్ హుబర్ అనారోగ్యంతో మరణించారు. హార్పర్‌ మృతి విషయాన్ని ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించారు. ఊపరితిత్తుల సమస్యతో హార్పర్‌ మరణించినా.. ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు. హార్పర్‌ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈను వీడి ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌లో చేరారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.

జోనాథన్ అకాల మరణం పట్ల రెజ్లింగ్ లోకం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువు స్టార్ రెజ్లర్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ‘జోనాథన్ హుబెర్‌ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం” అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్‌ చేసింది. పలువురు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్లు హార్పర్‌ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.