పవన్ కల్యాణ్ పై విమర్శలు తగదు

  • అనంతపురం జిల్లా జనసేన కార్యదర్శి గౌతమ్ కుమార్

ఉరవకొండ: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ఉరవకొండ వైసిపి ఇంచార్జ్ వై. విశ్వేశ్వర్ రెడ్డి మరియు వైసిపి ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన విమర్శలను అనంతపురం జిల్లా జనసేన కార్యదర్శి గౌతమ్ కుమార్ తీవ్రంగ ఖండించారు. బుధవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వారాహి విజయ యాత్రకి ప్రజల నుండి మంచి ఆదరణ రావటంతో ఒర్వలేక విశ్వేశ్వర రెడ్డి నోటికివచ్చినట్లు మాట్లడటం సరికాదన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజల డైరెక్షన్ లో నడిచే నాయకుడు అని మీ నాయకునిలాగా ఐ ప్యాక్ డైరెక్షన్ లో నడిచే వ్యక్తి కాదని విశ్వేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించడం మానేసి నియోజకవర్గ అభివృద్ది కోసం పాటు పడితే బాగుంటుందని హితువు పలికారు. ఉరవకొండ నియొజకవర్గానికి సంబందం లేని పోతుల సునీతకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత అర్హత లేదన్నారు. ప్యాకెజీ కోసం, పదవుల కోసం పార్టీలు మారే పోతుల సునీత రాబోయే ఎన్నికలలో ఏ పార్టీలో ఉంటుందో ప్రజలకి సమాధానం చెప్పాలన్నారు. బాధ్యతగల రాష్ట్ర మహిళా అధ్యక్షరాలి పదవిలో ఉన్న పోతుల సునీత ముందు ప్రజాస్వామ్య భాషను నేర్చుకోవాలని హితువు పలికారు. అతిత్వరలోనే వైసిపి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే వున్నాయి అని వై .విశ్వేశ్వర్ రెడ్డి కి, పోతుల సునీత ను హెచ్చరించారు.