రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వైసీపీ నేతలు

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలం, కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఎంపీ మిథున్ రెడ్డిలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, బీ.సీ.లు, దళితులను చిన్న చూపు చూస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీకలబైలులో టిడిపికి సంబంధించిన సర్పంచ్ ని సచివాలయ నూతన ప్రారంభోత్సవానికి పిలకపోవడం మరియు శిలాఫథకంలో సర్పంచ్ పేరు రాయకపోవడం బీసీ కులానికి, వాల్మీకి జాతికి అవమానం చేయడం జరిగింది. ప్రోటోకల్ పాటించలేదని ప్రశ్నించిన జనసేన కార్యకర్తల్ని, టీడీపీ కరకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జరిగింది. మంగళవారం వైసీపీ కౌన్సిలర్ 6వ వార్డు కు చెందిన ప్రసాద్ బాబు కౌన్సిలర్ దళిత కుంటుంబానికి చెందిన సోదరుడుని మీ పార్టీ మీ వైసీపీ కౌన్సిలర్ ని కులం పేరు పెట్టి దూషించి అవమానించడం జరిగింది. మదనపల్లిలో 33 కౌన్సిలర్లు గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి ఎవరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి జనసేన పార్టీ తరుపున తెలియజేసేదేమిటి అంటే ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు ఇకనైనా తన పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలని సూచన చేస్తూ, మంత్రి రామచంద్ర రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారించి బీసీలకు ఎస్సీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను వారికి కల్పించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి మండలం రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, కుమార్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.