గన్నేరుపుట్టు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ దర్శిని

  • గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా గన్నేరుపుట్టు గ్రామంలో జనసేన నాయకుల పర్యటన

అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.మాడుగుల మండలం, కె.కోడపల్లి పంచాయితీ, గన్నేరుపుట్టు గ్రామంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు, జి.మాడుగుల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మసాడి భీమన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ దర్శిని కార్యక్రమంలో భాగంగా.. గన్నేరుపుట్టు గ్రామంలో జి.మాడుగుల మండల నాయకులు పర్యటించడం జరిగినది. కార్యక్రమంలో ప్రధానంగా గ్రామ సమస్యలు పార్టీ తరఫున అడిగి తెలుసుకోవడం జరిగినది. సీసీ రోడ్, డ్రైనేజి సిస్టమ్ సరిగా లేదని గ్రామస్తులు జనసేన నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగినది. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా పంచాయితీ పరిదిలో సుమారు 30 గ్రామాలకు సంబంధించిన తాబేలిగుమ్మి అనే పంట కాల్వను మరమ్మత్తు చేస్తే మేము పంటలు పండించుకోవడానికి వీలుకలుగుతుంది ఈ సమస్యలపై అధికారుల దృష్టికి తెలియపరచి, రైతులకు మేలుచేసేలా పంట కాలువల పనులు చేయించాలని ప్రస్తుత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు రోజు, రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయని, రేషన్ లో పప్పు, నూనె ఏమీకూడా ఇవ్వడం లేదని, బయత షాపుల్లో కొనుగోలు ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ త్వరలోనే ఈ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, మాట తప్పడం మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాటి అని ప్రజాపాలకులుగా పూర్తిగా వైఫల్యం చెందారని, తండ్రి వైస్సార్ కి తగ్గ తనయుడు కాలేకపోయారని, బహుశా విద్యార్థి దశ నుంచే నిర్లక్ష్యపు, నేరస్వభావం కలిగిన వ్యక్తి అని, ప్రజలు కేవలం వైస్సార్ రాజశేఖర్ రెడ్డి గారిని నమ్మి మాత్రమే ఓటు వేశారని లేకుంటే నేరస్తులకు ఓటు వేసేంత అజ్ఞానులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కారని తెలిపారు. యూత్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ మాట్లాడుతూ ఇప్పటికైనా మేలుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించకపోతే ప్రజాపాలన కుంటుపడి, నిరుద్యోగ సమస్యలు ఎక్కువయ్యే ముప్పు పొంచివుందని తెలిపారు. జనసేన గ్రామ దర్శిని కార్యక్రమంలో మండల నాయకులు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సాగెని ఈశ్వరావు, యూత్ అధ్యక్షులు మస్తాన్, కార్యనిర్వాక కార్యదర్శి మసాడి సింహాచలం, కొర్ర భానుప్రసాద్ తదితర జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.