ఏపీ ప్రజలకు కరెంట్ షాక్ – జగనన్న బాదుడే బాదుడు

వైసీపీ ప్రభుత్వం భారీగా కరెంట్ చార్జీలను పెంచింది. కేటగిరీలను రద్దుచేసి, ఆరు శ్లాబుల రూపంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. సామాన్యుని నుండి సంపన్నుల వరకు అన్ని వర్గాల పై పెంచిన కరెంటు బిల్లుల భారం పడనుంది.

వేసవికి ముందే భానుడి ప్రతాపంతో వడ దెబ్బ తింటున్న ఆంధ్ర ప్రజలకు జగన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది.

ఇప్పటికే జగన్ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తుంది. చెత్త పన్ను, ఆస్తిపన్ను, మరుగుదొడ్ల పై పన్నులు వేస్తూ ఉక్కిరిబిక్కిరి వస్తుంది. పెంచిన విద్యుత్ చార్జీలు మరింత భారం కానుంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగినప్పుడు బాదుడే… బాదుడు… బాదుడే… బాదుడు… అంటూ నానా యాగీ చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బాటలోనే అనేక రకాలుగా పన్నుల భారం మోపింది. గతంలో ట్రూఆఫ్ చార్జీలు పెంచినప్పుడు జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. దాంతో వైసీపీ ప్రభుత్వం దిగొచ్చి ట్రూ ఆఫ్ చార్జీల పెంపును విరమించుకుంది.

పెంచిన కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని లేని ఎడల జనసేన పార్టీ ప్రజా పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని జనసేన పార్టీ తరపున ఎస్ వి బాబు డిమాండ్ జేశారు.