నాన్న త‌ప్ప‌కుండా జాతీయ జెండాను ఎగుర‌వేస్తార‌ు…భావోద్వేగంతో ట్వీట్ చేసిన షర్మిష్ట

భార‌త మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ  ఆరోగ్య పరిస్థితి మెరుగుపడని కారణంగా 74వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లో ఆయన పాల్గొన‌లేకపోవ‌డంపై ఆయన కుమార్తె ష‌ర్మిష్ట ముఖ‌ర్జీ గ‌త వేడుక‌ల జ్ఞాప‌కాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

‘‘నా చిన్న‌త‌నంలో నాన్న‌, మామ‌య్య క‌లిసి మా పూర్వీకుల ఇంట్లో జాతీయ జెండా ఎగురవేసేవారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాన్న స్వాతంత్ర్య వేడుకలను ఎన్నడూ మిస్ కాలేదు. ఈ సంద‌ర్భంగా నాన్న గ‌త జ్ఞాప‌కాల‌ను మీతో పంచుకుంటున్నాను. వ‌చ్చే ఏడాది నాన్న త‌ప్ప‌కుండా జాతీయ జెండాను ఎగుర‌వేస్తార‌ు..జైహింద్’’ అంటూ ష‌ర్మిష్ట ఆశాభావం వ్య‌క్తం చేస్తూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.