‘మెగాస్టార్ లెజెండ్’ పుస్తకాన్నిఆవిష్కరించిన రాజోలు తాలూకా చిరంజీవి యువత

పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో భాగంగా రాజోలు తాలూకా చిరుపవన్ సేవాసమితి అధ్వర్యంలో మామిడికుదురులో ది లెజెండ్ ఆఫ్ చిరంజీవి పుస్తకాన్ని అమలాపురం బిజెపి పార్లమెంటరీ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా చేతుల మీదుగా  ఆవిష్కరించారు. అనంతరం అభిమానులకు ఆ పుస్తకాన్ని పంచారు. వేమా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ఆధారంగా ది లెజెండ్ అనే పుస్తకాన్ని ఆయన చేతులు మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అలాగే చిరంజీవి అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు ఎందరికో ఉపయోగపడే విధంగా ఉంటున్నాయని ఆపదలో ఉన్నవారిని రక్తం కావాలి అంటే తక్కువ టైంలో ప్రజలకు అందించడంలో ముందుంటున్నారని వేమా ఇంకా మరేన్నో మంచిపనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని వేమా అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజోలు తాలూకా చిరు పవన్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గుండాబత్తుల తాతాజీ, తాటిపాక టౌన్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి నారాయణ, జిల్లా చిరు యువత సెక్రటరీ తులా ఆది, జనసేన మండల అధ్యక్షుడు అడబాల తాతాకాపు, కోళ్ళబాబి, మట్టా సత్తిబాబు, అడబాలవిజయ్, కోలా సురేష్, ఇంటిమహేంద్ర, కోళ్ల బద్రీ, బాలసురేష్, నైనాలశ్రీరాం, నైనాల కిరణ్, చెపూరిసతీష్, ఇంటి కార్తీక్, సంకర నరేంద్ర మరియు చిరు, పవన్ అభిమానులు పాల్గొన్నారు.