దళితబందు దళితులందరికి ఒకేసారి కేటాయించాలి: ఆకుల సుమన్

హనుమకొండ, తెలంగాణ రాష్టంలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులందరికి ఒకేసారి కేటాయించాలని జనసేన పార్టి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 2014 ఎన్నికల సమయంలో దళితులకు 3ఎకరాల భూమి దళితుడే తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రి అని కెసిఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. నిజంగా దళితుల మీద ఈ ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఉన్న దళితులందికి ఒకేసారి దళితబందు ఇవ్వాలని డిమాండ్ చేసారు. దళితులు అంటే కేవలం తెరాస పార్టి ఎమ్మెల్యేల అనుచరులు మాత్రమే కాదని, ఈ విషయం ముఖ్యమంత్రి వర్యులు గ్రహించాలని మరియు రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబందు అందని పక్షంలో జనసేన పార్టి తరపున దళితులకు అండగా పోరాటాలు చేస్తామనిని ఆకుల సుమన్ తెలియజేసారు.