గొల్లలపాలెం గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందజేసిన జనసేన నాయకులు

మాడుగుల, కె.కోటపాడు, యువత క్రీడల్లో రాణించాలని జనసేన పార్టీ మండల జనసేనపార్టీ నాయకులు కుంచా అంజిబాబు సమాకూర్చిన క్రికెట్ కిట్ ను ఆదివారం కింతాడ పంచాయతీ గొల్లలపాలెం గ్రామ యువతకు కడుపుట్ల గంగునాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ క్రీడలు పట్లఆసక్తిగల యువకులను ప్రోత్సహించడానికి ఇప్పటికే పలుగ్రామాల్లో జనసేనపార్టీ తరపున క్రీడాసామాగ్రిని పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు మజ్జి ఈశ్వరరావు (చిన్న), రాజు,మహేష్, గోవింద (గొల్డ్), కోటీ, గణేష్, శ్రీను, మహేష్, సూర్య, గొల్లలపాలెం జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.