దళిత ఆత్మీయ సమావేశం

పెడన నియోజవర్గం: బంటుమిల్లి మండలం, ఆముదాల పల్లి గ్రామంలో దళిత ఆత్మీయ సమావేశాన్ని జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం దళితులను అనేక విధాల మోసం చేసిందని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిలిపివేసిందని, నిధులు దుర్వినియోగం చేసిందని జనసేన నాయకులు వైసిపి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. దళితులు ఎంతగానో ఆరాధించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ విద్యా దీవెనను వైఎస్ఆర్ విద్యార్థినిగా మార్చి అంబేద్కర్ గారిని అవమానపరిచింది వైసిపి ప్రభుత్వం. దళిత యువకుడ్ని హత్య చేసి హోం డెలివరీ చేసిన నాయకులు జగన్ వెంట ఉన్నారని తెలియజేశారు. అంబేద్కర్ ఆశయాల సిద్ధించాలన్న, దళితులకు న్యాయం జరగాలన్న అది జనసేన పార్టీతోనే సాధ్యం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని దళితులకు న్యాయం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో దళిత సోదరులందరూ ఏకతాటికపై వచ్చి జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తామని, పవన్ కళ్యాణ్ గారి వెంటే మా పయనం అని దళిత యువకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, కృష్ణాజిల్లా కార్యదర్శులు కూనసాని నాగబాబు, కొల్లేరు సర్పంచ్ బట్టు కనకదుర్గ, ఒడిని జయరాజ్, బంటుమిల్లి మండల ఉపాధ్యక్షులు గొట్రు రవికిరణ్, ఎడ్లపల్లి రూకేష్, మోచర్ల శర్మ, శాఖ నాగబాబు, పెందూరు నాగబాబు, సురేషు, చెక్క శ్యామ్, కాకర్ల నాగరాజు, ఎస్ అమర్ బాబు, ముదినేని రామకృష్ణ, సీరం సంతోష్, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, బొమ్మిరెడ్డి భగవాన్, పినిశెట్టి రాజు, దాసరి రవీంద్ర, పాండమనేని నాగు, వెంగళ పెంటయ్య, గంటా విజయ్, కాండ్ర జోజి, దాసరి ప్రభాకర్ రావు, ముక్కొలు శ్రీనివాస్, పాలపర్తి ఏసు దాసు, ఓడిమె రాజేష్, పాలపర్తి ముత్యాలు, ఈదా నాని, గొల్ల శివప్రసాద్, బత్తుల యశ్వనంద్, నల్లగంగుల జోగి, పాలపర్తి యొదు మరియు పెద్ద ఎత్తున ఆముదాల పల్లి ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.