బెంతో ఒరియా రిలే నిరాహార దీక్షకు నర్తు రామారావు సంఘీభావం

ఇచ్చాపురం: కవిటి కేంద్రంలో నిర్వహించిన బెంతో ఒరియా నిరహార దీక్షలో రాజుపురం గ్రామస్తులు, మహిళలు, కులపెద్ద దొండ్య లోకునాథ్ పాల్గొన్నారు. శనివారం బెంతో ఒరియా రిలే నిరాహార దీక్ష శిబిరంను సందర్శించి సంఘీభావం తెలియజేసిన సందర్భంలో నర్తు రామారావు మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం నియోజక వర్గంలో గల సుమారు 79 కులాలకు ప్రభుత్వ పథకాలు అంది అన్ని విధాల న్యాయం జరిగిందని, కేవలం బెంతో ఒరియా సమస్యకు పరిష్కారం జరగక పోవడం బాధాకరం అని అన్నారు. పరిక్షరం కోసం నా వంతు పాటు పడతానని, గతంలో రాజేషేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ విషయం దృష్టిలో ఉందని దురదృష్ట వశాత్తూ ఆయన స్వర్గీయులు ఐనారని అలా పెండింగ్లో ఉండిపోయిందని స్వస్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో 12కులాలను బీసీఏలో చేర్చి న్యాయం చేశారని అన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాణినిక్యపురం గ్రామంలో పరిక్షారిస్తానని మాటిచ్చారు. మాట ఇస్తే త్వరలో నెరవేర్చుతారని ఆశ వ్యక్తం చేశారు. శ్రీకాకుళం శాసన మండలి సభ్యులు నర్తు రామారావు, నర్తు ప్రేమ్, సోంపేట జెడ్పీటీసీ తడక జోగారావు, కంచిలి జెడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణా రావు, కవిటి ఎంపీటీసీ 1పూడి నీలాచలం తదితరులు పాల్గొన్నారు.