ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే చీకటి జీవో: అనుశ్రీ సత్యనారాయణ

  • జీవో నెంబర్ వన్ ప్రతులను దగ్ధం చేసిన జనసేన నాయకులు

రాజమండ్రి సిటీ: ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జగన్ ప్రభుత్వం చీకటి జీవో నెంబర్ వన్ జారీ చేసిందని జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ మండిపడ్డారు. జనసేన ఆధ్వర్యంలో శనివారం జీవో ప్రతులను సోమాలమ్మ గుడి వద్ద భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రథ యాత్ర చేపడుతున్నారని తెలియగానే అధికార వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల్లో దడ పుట్టి చీకటి జీవో తెచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గెడ్డం నాగరాజు, గుత్తుల సత్యనారాయణ, నల్లంశెట్టి వీరబాబు, అల్లాటి రాజు, విన్నా వాసు, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.