బ్రిడ్జి కూలిన ప్రదేశంలో దాసరి రాజు నిరసన

ఇచ్ఛాపురం బహుదా నది బ్రిడ్జి కింద ఇసుక అక్రమ తవ్వకాల వల్ల బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లుతుందని ముందు నుండి ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు, దాని ఫలితమే బుధవారం లారీ ఓవర్ లోడుతో వెళ్ళిన సందర్భంగా బ్రిడ్జి కూలిపోవడానికి కారణం అయిందని, అందుకే బ్రిడ్జి కూలిన ప్రదేశంలో జనసేన ఇంఛార్జి దాసరి రాజు జనసైనికులు మరియు వీరమహిళలతో కలిసి ఉదయం 7 గంటల నుండి నిరసన దీక్ష చేపట్టారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా బహుదానది బ్రిడ్జి కోసం నిరసన తెలియజేస్తూ రాత్రి 8 గంటల సమయం వరకు నిరసన తెలియజేయడం జరిగింది. కూలిన బ్రిడ్జ్ వద్ద నిరంతరాయంగా రాత్రి వరకు జనసేన నిరసన కొనసాగింది. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రభుత్వ అధికారులు వచ్చేంతవరకు కొనసాగుతుందని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తెలియజేయడంతో రాత్రి 8 గంటల సమయంలో రూరల్ ఎస్సై టౌన్ ఎస్ఐ స్థానిక ఎమ్మార్వో వచ్చి రేపు కలెక్టర్ వస్తున్నారు, ఆ సమయంలో మీతో కలిసి మీ ప్రధాన డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాని విరమించడం జరిగినది. ఈ నిరసన కార్యక్రమంలో ఇచ్చాపురం మున్సిపాలిటీ వార్డ్ ఇన్చార్జులు దాసరి శేఖర్, రోకళ్ల భాస్కరరావు, సంతోష్ మహారాణా, ఢిల్లీ బిసాయి, కాళియా గౌడో, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరిబెహరా, కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వర్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, ఇచ్చాపురం మండలం అధ్యక్షులు దుర్గసి నీలవేణి, సోంపేట వీరమహిళ శైలజా, జన సైనికులు మన్మధ, చిట్టు బెహరా, సంజయ్ రౌలో, నగేష్, రాహుల్, రుక్కు తదితరులు పాల్గొన్నారు.