రజనీకాంత్ అవతారమెత్తిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గ్రౌండ్‌లో ఎంతగా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వార్నర్ తన ఫ్యామిలీతో కలిసి సౌత్ సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగులు, హీరోల హావభావాలతో వీడియో రూపొందించి అలరించాడు. 2020ని మహర్షిలా మారి ముగించిన వార్నర్ కొత్త సంవత్సరాన్ని రజనీకాంత్ గెటప్‌తో మొదలు పెట్టాడు.

దర్భార్ సినిమాలో రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సీన్స్‌లో ఆయన ఫేస్‌కు బదులు తన ముఖాన్ని యాడ్ చేసి ఓ వీడియోని షేర్ చేశాడు వార్నర్. చాలా మంది కోరిక మేరకు ఈ వీడియో చేశాను. అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వార్నర్ టిక్‌టాక్‌ వీడియోలతో మరింత ఫేమ్‌ని సంపాదించుకున్నాడు. ఆయన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటి నుండి తెలుగు ప్రేక్షకులకి చాలా చేరువయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *