రజనీకాంత్ ఇంటి ముందు నిప్పంటించుకున్న అభిమాని

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై తన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి తమిళనాట భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.  రజనీ అనారోగ్యం వలన తాను రాజకీయాలలోకి రాలేనంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. ఆయన దిష్టిబొమ్మలు తగలబెట్టడం, ఇంటి ముందు నిరసనలు, ర్యాలీలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా మురుకేసన్ అనే వ్యక్తి రజనీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మురుకేసన్‌ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ప్రస్తుత వైద్యం అందిస్తున్నారు. తమిళనాట జరుగుతున్న భారీ ఆందోళనలకు తలైవా ఎలా చెక్ పెడతాడని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *