ఏజన్సీలో అమాయకులపై ఎక్సైజ్ శాఖ దాడులు దారుణం: దాసరి నరేంద్ర

రంపచోడవరం నియోజవర్గం: కూనవరం ఏజన్సీలో ఎక్సైంజ్ శాఖ అధికారి అమాయకులపై దాడులు చేయడం దారుణమని, రాత్రి వేళలో మహిళలు ఉన్నా ఇళ్లలో సోదాలు చేయడం, మాకు సమాచారం వచ్చింది అంటూ అమాయకులపై దాడులు చేయడం అన్యాయమని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసరి నరేంద్ర కుమార్ మండిపడ్డారు. చింతూరు కేంద్రంగా ఉన్న సెబ్ (ఎక్సైజ్) అధికారీ కొద్దీ రోజులుగా సారా అమ్ముతున్నారూ, అక్రమ మధ్యం అమ్ముతున్నారు అంటూ అమాయకులపై లేని పోనీ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ మీరు అమ్మిన అమ్మకపోయిన చింతూరు ఆఫీస్ కు వచ్చి మాట్లాడుకోండి, లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు గురి చేయడం దారుణమని అన్నారు. గతంలో టేకులబోరుకు చెందిన ఒక మహిళ కిరాణా షాపు వద్ద తనిఖీ నిర్వహించి గోడ మీద నంబర్ రాసి ఈ నంబర్ కి కాల్ చేయండి, లేదా ఆఫీస్ కి వచ్చి కలవండి అనడం, ఇదే క్రమంలో ఉదయ భాస్కర్ కాలనీలో ఒక ఇంటి పై దాడి చేసి ఇళ్లంతా చిందర వందర చేసి ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని ఇబ్బంది పెట్టడం, నిన్నటికి నిన్న కోతులగుట్ట గ్రామంలో కిరాణా షాప్ లోకి వెళ్లి మీరు మద్యం అమ్ముతున్నారని సమాచారం వచ్చింది అంటూ అందుకే వచ్చాము అని రేపు ఉదయం స్టేషన్ కి వచ్చి కలవండి అంటూనే పక్కనే ఉన్న డ్రైవర్ ఎందుకు ఈ కేసులన్ని ఇప్పుడు సెటిల్ చేసుకోండి అని అనడంపై వీరి ప్రవర్తన ఎక్కడికి వరకు వెళ్తుందో తెలియక పోలేదు. మండలంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి మధ్యం దుఃఖానలకంటే అధిక రేట్లు అమ్ముతుంటే మరి ఈ ఎక్సైజ్ అధికారులకు ఎందుకు కనపడటం లేదు. నెల నెల వచ్చి మామూళ్లు వసూళ్లు చేసుకోవడం పైనే దృష్టి పెడుతున్నారు తప్పా బెల్టు షాపులపై దాడులు చేయకుండా అమయకులపైన దాడులు చేసి వారిని బెదిరింపులకు గురి చేయడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాం. ఇంత జరుగుతున్నా పై అధికారులు పట్టిచుకోకపోవడం పట్ల డివిజన్ లో ఉన్న ప్రజలు మండి పడుతున్నారు. ఇప్పటికైనా చింతూరు ఎక్సైంజ్ అధికారి తీరు మార్చుకోకపోతే మీపై ఉన్న ఆరోపనలకి సాక్షాధారలతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఒక్కో బెల్ట్ షాప్ కి నెల నెలా రెండు వేల రూపాయలు కమీషన్స్ తీసుకుంటున్నారని బెల్టు షాప్ నిర్వాహకులు చెప్పడం పై ఈ అధికారి తీరు కేవలం కాసుల కోసమే విధులు నిర్వహిస్తున్నారూ తప్పా ప్రభుత్వం కోసం కాదు. ఈ అధికారికి తన జీప్ డ్రైవర్ ముందుగా వెళ్లి సెటిల్మెంట్ చేసి మధ్యవర్తిగా ఉంటూ పలుచోట్ల బెదిరింపులకు గురి చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా పై అధికారులు ఈ అధికారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.