జనచైతన్య శంఖారావం కార్యక్రమం 19వ రోజు

రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం, బి.ఎస్.అర్ కాలనీ కొత్తపేట ఏరియాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జనచైతన్య శంఖారావం కార్యక్రమం 19వ రోజు ప్రారంభించటం జరిగింది. ఈ ప్రాంతంలో అడుగడుగునా సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది దోమలు మరియు మురికి నీటితోటి కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. సరిగా వెలగని స్ట్రీట్ లైట్స్, మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు. వీరితో దుర్గేష్ మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ తీరుస్తానని తొందరలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారం రాబోతుందని మీకు అన్ని సమస్యలు తీరతాయని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు, జిల్లా కార్యదర్శి వీర ప్రకాష్, దూది సాయి, మట్టపర్తి నాగరాజు, శివారెడ్డి, అల్లంపల్లి ప్రసాద్, వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్, జంగా వినోద్, ఆవాల శివ, ఆటో బుజ్జి, వెంకన్న, సులేమాన్, రాఖి మరియు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.