విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం జనసేన వినతి పత్రం

ఇచ్చాపురం నియోజకవర్గం: ఇచ్చాపురం మండలం, ముచ్చింద్ర పంచాయతీలో గల బెనిగానిపేట గ్రామంలో విద్యుత్ సరిపోక, ఓ వైపు ఎండలు.. మరోవైపు లో ఓల్టేజ్‌.. ఇది చాలదన్నట్టు కరెంటు కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంగళవారం ఏ ఈని కలిసిన గ్రామస్తులు విద్యుత్ ట్రాన్సపార్మర్ మార్చమని వినతి పత్రం అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మరియు గ్రామ పెద్దలు కల్లి దుర్యోధన, సడి మోహన్, బగ్త దానయ్య, సి.హెచ్ దానయ్య, కె శ్రీరాములు, సి.హెచ్ బాబులు టి రవి బి. పురుషోత్తమ, టి సోమేష్, టి రాము పాల్గొన్నారు.