పరిమితికి లోబడే అప్పులు: మంత్రి బుగ్గన

కేంద్ర నిబంధనలకు లోబడే అప్పులు చేస్తున్నట్టు రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేరద్రనాధ్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అప్పుల వివరాలను వెల్లడించిన ఆయన ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. తాము బాధ్యతగానే వ్యవహరిస్తున్నామని తెలుగుదేశం హయారలో విచ్చలవిడిగా చేసిన అప్పుల వల్లే భారం పెరిగిందని అన్నారు. దానికి తోడు కరోనా కారణంగా ప్రస్తుతం భారీగా నిధులు ఖర్చులు చేయాల్సివస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటికోసమే రుణాలు సేకరిస్తున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీలకు 17,608 కోట్లు చెల్లిరచామని, వీటివల్ల మహిళలు ఆర్ధిక ప్రగతి సాధిరచడంతో పాటు, కరోనా కష్టకాలంలో నగదు బదిలీవల్ల వస్తు సేవల డిమారడ్‌ను కాపాడగలిగామన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆర్థికస్థితిని కాపాడుకోగలిగామన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గలేదని తెలుగుదేశం చేస్తున్న వాదన సరికాదన్నారు. రాష్ట్ర సొరత పన్నుల ఆదాయంలో కూడా పెరుగుదల లేదని గుర్తు చేశారు. జిఎస్‌డిపి పెరుగుతున్న కొద్దీ అరదులో మూడు శాతంతో రాష్ట్రం తీసుకునే అప్పులు కూడా పెరుగుతాయని వివరిరచారు. 2014ా15లో జిఎస్‌డిపి 5.26 లక్షల కోట్లు ఉరదని, తద్వారా 15,794 కోట్లు రుణం తీసుకున్నారని, ఇప్పుడు పది లక్షల కోట్లుగా జిఎస్‌డిపి ఉరదని వివరిరచారు. అందువల్లే అప్పు తీసుకోవడానికి పరిమితి పెరగిందని పేర్కొన్నారు.