బిగ్ బాస్ సోహెల్ హీరోగా డెబ్యూ మూవీ

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కాని విన్నర్ గా నిలచిన సోహెల్ ప్రతి ఒక్కరి మనసులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున కూడా సోహెల్‌కు ఫిదా అయ్యారు. చిరంజీవి తన భార్య సురేఖతో వండించిన బిర్యానీని సోహెల్‌కు పంపగా, నాగార్జున పది లక్షల రూపాయలు ఇస్తానని అన్నారు. అంతేకాదు సోహెల్ సినిమాలో తనకు ఓ చిన్న పాత్ర ఇవ్వాలని కోరారు చిరంజీవి. దానికి తోడు సోహెల్ కు పెరిగిన క్రేజ్ తో సినిమా ఆఫర్లు వరుసగా వస్తున్నాయి.

బిగ్ బాస్ ఫినాలే రోజు మంచి సినిమా చేస్తానని చెప్పిన సోహెల్ ఇప్పుడు తన డెబ్యూ చిత్రాన్ని ప్రకటించాడు. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ నిర్మాతలు అప్పిరెడ్డితో కలిసి సినిమా చేయనుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపతి తెరకెక్కించనున్నారు. వచ్చే వారం రెండు వారాల్లో ఈ చిత్ర టైటిల్‌తో పాటు క్రూ అండ్ క్యాస్ట్ ప్రకటించనున్నారు.