టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఈ రోజు ఐపీఎల్ 2020 లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాప్టెన్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ పంజాబ్ కు చాలా ముఖ్యం. వారు ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పకుండ గెలవాలి. ఒకవేళ ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి మరి.