కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఆరువేటి నగరం మండల కేంద్రం, గాండ్ల మిట్ట వద్ద జనసేన ఇంచార్జి యుగంధర్ ఆధ్వర్యంలో 12 గంటలపాటు నిరాహార దీక్ష నిర్వహించారు. నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే స్థాయిలోనే పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మేనియాతో మొత్తం నియోజకవర్గాన్నే తిరుపతిలో కలిపి సత్తా చాటుకున్నారు. పుంగనూరు ఎమ్మెల్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచర్ల, పులిచెర్ల మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతున్నప్పుడు, నీకేం వచ్చింది స్వామి, అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్వార్థమా, స్వలాభమా? అని విమర్శించారు. తన స్వార్థం కోసం రెండు మండలాలను బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎందుకు రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలపకూడదో సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నానన్నారు. ఈ రెండు మండలాల ప్రజలు ప్రతీ నిత్యం వ్యాపారం చేయడానికైనా, ఏదైనా పనికోసం అయినా 90% మంది ప్రజలు తిరుపతికి వెళతారు గాని చిత్తూరుకి వెళ్లరు. ఇప్పటికైనా ఉపముఖ్యమంత్రి స్పందించి కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గౌతమ్ రాజు నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నరేష్, దేవేంద్ర, హరీష్, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యనిర్వహక కమిటీ సభ్యులు భానుచంద్ర రెడ్డి, కార్యదర్శులు ప్రతాప్, మురళి, మధు, నాయకులు రషీద్, బాబ్జాన్, చంద్ర, జనసైనికులు పాల్గొన్నారు.