చాట్రాయి గ్రామంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

నూజివీడు నియోజకవర్గం: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా శనివారం చాట్రాయి గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా బర్మా ఫణి బాబు ఆర్.సి.యం స్కూల్లో బుక్స్ పెన్నులు పంచి పెట్టి, వికలాంగులకు సన్మానించి, వారికి ఆర్థిక సహాయం అందించి, కంటి వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేసారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నాయకులు బర్మా ఫణి బాబు, టౌన్ నాయకులు ముత్యాల కామేష్, చాట్రాయి మండల ఉపాధ్యక్షులు తుమ్మల జగన్, రాంబాబు, దుర్గాప్రసాద్, కోటేశ్వరావు, నాగబాబు పాశం, శ్రీకాంత్, అభిరామ్, రామకృష్ణ, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.