ఐసిడిఎస్ సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలి: డేగల

తెలంగాణ, అశ్వారావుపేట: అశ్వారావుపేట రింగ్ రోడ్ నందు ఐసిడిఎస్ సిబ్బంది చేస్తున్న సమ్మె 20వ రోజుకు చేరగా ఆదివారం అశ్వారావుపేట జనసేన పార్టీ తరఫునుండి వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి డేగల రామచంద్ర రావు మాట్లాడుతూ ఐసిడిఎస్ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం ఉద్యోగులుగా వారిని గుర్తించి, ప్రభుత్వం తరఫునుండి  వర్థంచే ప్రతి సంక్షేమ పథకాన్ని వీరికి కూడా అందించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ సమస్యను తెలంగాణ  రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకువెళ్లి వారికి పూర్తి మద్దతు తెలియజేస్తామని, ఐసిడిఎస్ సిబ్బందికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ ఇస్లావత్ వినోద్, ప్రధాన కార్యదర్శి మల్లం రామ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, టౌన్ ప్రెసిడెంట్ దామెర బాబీ, వీరమహిల యనమదల సునీత, తెలగరెడ్డి సత్యనారాయణ, క్రాంతి, మౌళి, ముత్యాల రావు, జనసైనికులు పాల్గొన్నారు.