గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన ఆరవ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం. హుస్సేన్ పురం పంచాయతీ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన ఆరవ రోజు కార్యక్రమంలో బాగంగా జోరువానలో వీరఘట్టం జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మహిళలు ప్రధాన సమస్యలు కాలువాలు లేక గ్రామ వీధులులోనే వర్షం నీరు, ఇంటిలో వాడే నీరు ప్రవహిస్తుంది. మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయి.. వాటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నము, ప్రస్తుత ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ మాలాఒటి దినసరి కూలీలకు ధరలు అందనంత దూరంలో ఉన్నాయి. రేషన్ ఒక్క బియ్యం మాత్రమే ఇస్తున్నారు, చీనీ, కంది పప్పు, నూనె, ఇవ్వడం లేదని తెలిపారు. సమస్యలు విన్న అనంతరం జనసేన జాని మాట్లాడుతూ జనసేన పార్టీ బియ్యం కి బదులు ఒక కుటుంబంకి సరిపడ్డ నిత్యావసర సరుకుల కొనుక్కునే విధంగా తెల్ల కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి రెండువేల ఐదు వందల రూపాయల నుండి మూడు వేల ఐదువందలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారని, వంట వండుకోడానికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ప్రతి నెల ఇస్తారని మహిళలకు వివరించారు. మత్స.పుండరీకం మాట్లాడుతూ మహిళకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని, అరవై ఏళ్లు నిండిన రైతులకు ఫెంక్షన్ ఇస్తాము, కౌలు రైతులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాము, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని మహిళలకు వివరించారు. మహిళలు అందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని మీ అమూల్యమైన ఓటు జనసేన పార్టీ గాజుగ్లాస్ గుర్తు కు వేయాలని మత్స. పుండరీకం కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణేన సాయి పవన్, రాజు, కోడి వెంకట రావు నాయుడు, వావిలపల్లి నాగభూషన్, దూసి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.