లక్ష్మీపల్లిలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కళ్యాణదుర్గం నియోజకవర్గం: శెట్టూరు మండలం లక్ష్మీపల్లి గ్రామంలో ఆదివారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ ఒక్క గ్రామంలోనే 45 సభ్యత్వాలు చేసుకున్న నాయకులు అందరికీ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న జనసైనికుడికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తక్షణమే 50,000/ రూపాయలు నగదు, మృత్యువాత పడితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇంత వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారని, భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వ విధానాన్ని తీసుకొని వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం జనసేన టిడిపి పార్టీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరు పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాలని అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీని అధికారం నుండి దించడమే బాగంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా ఏకతాటి మీద నిలబడి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ జగన్ పాలనకు స్వస్తి పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్ ఉపాధ్యక్షులు వంశీకృష్ణ, బొజ్జప్ప వీరభద్ర టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది. జనసేన నాయకులు ముక్కన్న, జనసేన మండల కార్యదర్శి లక్ష్మణ్ విరుపాక్షి, లోకేష్, కార్తీక్, సుదర్శన్, రాజ్ గోపాల్, అగ్ని, ప్రశాంత్, గంగాధర, వెంకటేష్, రామచంద్ర, గోపాల్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.