ఆశాజ్యోతి హ్యాండీ క్యాపెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన దెందులూరు జనసేన

దెందులూరు నియోజకవర్గం అప్పనవీడు గ్రామంలోని ఆశాజ్యోతి హ్యాండీ క్యాపెడ్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమంలో చిన్నారులను కలిసి నూతన సంవత్సర వేడుకలు వారితో జరుపుకోవడం జరిగింది, దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ కొఠారు ఆదిశేషు జనసేన నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, చిన్నారులకు కేకులు, చాక్లెట్స్, బిస్కెట్స్, పండ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపూరు, అప్పనవీడు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.