ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఒక బ్రోకర్!!

  • పవన్ కళ్యాణ్ కి ఎంత తీసి ఇచ్చావు?
  • నువ్వు ఎంత పుచ్చు కున్నావు?
  • స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకు పడ్డ జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: కార్వేటినగరం మండల కేంద్రంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఒక దళారి, ఒక బ్రోకర్ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కి ఎంత ప్యాకేజీ తీసి ఇచ్చావు?.. నువ్వు ఎంత పుచ్చుకున్నావు?.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒక నైపుణ్య భవనము, ఒకే కౌశల్యం మీద అసాధారణ ఏకాగ్రత, తన యావదాస్తిని తుణప్రాయంగా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి వచ్చిన మహానుభావుడు, ఆపద్బాంధవుడని అభివర్ణించారు. అసమర్థత, అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఒక్కో కుటుంబానికి ఒక లక్ష చొప్పున ఆదుకున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్. కార్వేటినగరం మండల కేంద్రంలో కాశీ తోట వీధిలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద మహిళకు ఇంటి నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వలేని అసమర్ధ రాజకీయ నాయకుడు నారాయణస్వామి అని, కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్ధ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని, వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్థ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని ఎద్దేవా చేసారు. కార్వేటి నగరం నుండి పచ్చికాపల్లం వరకు రోడ్డు వెడల్పు చేయలేని అసమర్ధుడు నారాయణస్వామి అని, పచ్చికా పల్లం నుండి వెదురుకుప్పం వరకు డబల్ రోడ్డు వేయలేని అసమర్థుడు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని, వెదురుకుప్ప నుండి దేవళంపేట మీదుగా కొత్తపల్లి మెట్ట వరకు రోడ్డు వెడల్పు చేయలేని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అసమర్థుడని, నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడినట్టు ఏ ఇంటికీ ఉపయోగపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబమంతా స్వార్థంతో నిండిపోయిందని, కుటుంబ అభివృద్ధి తప్ప, ప్రజాభివృద్ధిపై ఏమాత్రం అక్కరలేని అసమర్ధుడు నారాయణస్వామి అని ఎద్దేవా చేశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని ఒక అసమర్థుడు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంకోసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ తీసుకున్నాడని మొరిగితే మూడు వేల మంది జనసైనికులు మూడు వేల చెప్పులతో కొడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, వీరమహిళా విభాగం అధ్యక్షురాలు సెల్వి, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, మండల కార్యదర్శి ప్రతాప్, కార్వేటి నగరం టౌన్ కమిటీ కార్యదర్శి మీనా పాల్గొన్నారు.