ఓట్లు, సీట్లు కోసం గిరిజనులను నాశనం చేస్తారా?

  • గిరిజనుల రిజర్వేషన్లకు తూట్లుపొడుస్తారా ?
  • గిరిజనుల జోలికొస్తే ఊరుకునేది లేదు

అరకు నియోజకవర్గం, రాజకీయాల్లో డబ్బు పరంగా, సామాజికంగా అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన బీసీ – బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చడానికి సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఏక సభ్య శామ్యూల్ ఆనంద్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని జనసేనపార్టీ అరకు నియోజకవర్గ జనసేన నాయకులు బంగురు రామదాసు తప్పు పట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే గిరిజనులు అభివృద్ధిలో ఇతర వర్గాల కన్నా వెనకబడి ఉన్నారని నీళ్లు, రోడ్లు, ఇళ్ళు లేని అనేక గ్రామాలతో అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందలేక పోయారని, అభివృద్ధిలో ముందడుగులో ఉన్న బోయ, బెంతో, ఒరియాలు ఉన్నారని, గిరిజన 33 తెగలు 28 లక్షల మంది ఉంటే బోయ, బెంతో, ఒరియలు కలిపి 60 లక్షలు ఉన్నారని, వీరితో నిజమైన గిరిజనుల భవిష్యత్ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 52 జీవో ,శామ్యూల్ ఆనంద్ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, 52 జీవో పై వైఖరి తెలియజేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొనేడి లక్ష్మణ్, అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.