ఏపీలో దిగజారుతున్న విద్యా ప్రమాణాలు

-స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా రిపోర్టు ప్రకారం, దేశంలో విద్యాప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానం

★ ఏపీలో జగన్ రెడ్డి విధానాలతో రోజురోజుకూ విద్యా ప్రమాణాలు దిగుజారుతున్నాయి.
★ నూతన విద్యావిధానం పేరుతో ఉన్న బడులను మూసేసేలా ప్రభుత్వ తీరు ఉంది.
★ వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలను భూముల కోసం నిర్వీర్యం చేశారు.
★ తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా రిపోర్టుతో ఈ విషయం స్పష్టమైంది.
★ 5 కేటగిరీలు, 41 అంశాలతో ఎన్.ఏ.ఎస్, ఆసర్ డేటా మరియు ఆయా రాష్ట్రాల నుండి సమాచారం సేకరించి నివేదికను రూపొందించారు.
★ 5 కేటగిరీల్లో ఏపీకి కనీసం ఒక్కదానిలో కూడా టాప్ 5 స్థానం దక్కలేదు.
★ బాల, బాలికల అక్షరాస్యతలో తేడాను పరిశీలిస్తే ఏపీ 12వ(17.20) స్థానంలో ఉంది.
★ దేశంలో సగటు కంటే రాష్ట్రంలో ఎక్కువ ఉంది.
★ విద్యా మౌళికసదుపాయాల్లో డిల్లీ మొదటి స్థానంలో(92.98) ఉంటే ఏపీ 19వ స్థానం(56.97)లో మాత్రమే ఉంది.
★ అందుబాటులో విద్యలో మొదటి స్థానంలో మేఘాలయ(63.44)ఉంటే, ఏపీ 11వ స్థానం(38.50)లో ఉంది.
★ కనీస వైద్య సదుపాయంలో సిక్కిం మొదటి స్థానం(80.31)లో ఉంటే, ఏపీ11వ స్థానం(56.37)లో ఉంది.
★ గవర్నెన్స్ అంశంలో పశ్చిమ బెంగాల్ మొదటిస్థానం(49.99)లో ఉంటే, ఏపీ21వ స్థానం(24.13)లో ఉంది.
★ నాడు నేడు అని గొప్పలు చెప్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యా మౌళిక సదుపాయాల్లో దేశంలో ఏపీ 19 స్థానంలో ఉంది.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే సాక్షి పత్రికలో మాత్రం దేశంలో మొదటి స్థానం అంటూ చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా..?
విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. ఇప్పటికైనా దొంగ లెక్కలు మానేసి విద్యా ప్రమాణాలపై దృష్టి సారించాలని జనసేన కోరుకుంటుందని, విద్యార్థులకు మంచి విద్యను అందించి, భావితరాల భవిష్యత్ కాపాడాలని జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ కోరారు.