అనంతపురం జిల్లా జనసైనికులతో నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం

అనంతపురం, ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫ్ఫైర్స్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం ప్రేమకు ప్రతిరూపం అని గతంలో కూడా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించినప్పుడు కూడా అశేష జనవాహిని విచ్చేశారని గుర్తు చేసుకున్నారు.

జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కాబట్టి జన సైనికులు ఈ ప్రభుత్వ అసమర్థ పాలనను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న రహదారుల పరిస్థితి దారుణంగా ఉందని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే గాంధీ జయంతి రోజు “రహదారుల శ్రమదానానికి” కొత్త చెరువుకు వస్తున్నారని తెలిసి ఈ వైసీపీ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి కిలోమీటర్ల రోడ్డు వేసిన విషయం జనసైనికులకు వివరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నియోజక వర్గంలో ఉన్న జన సేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడాలని ఈ అసమర్థ ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా అనాలోచితంగానే మూర్ఖంగా వ్యవహరిస్తోందని ఇటువంటి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ది చెప్పడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై కార్యకర్తలపై కేసులు పెడుతూ రాజకీయ వత్తిళ్లకు గురిచేస్తున్నారని ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వారు కాదని రాయలసీమ ప్రాంత ప్రజలని రాయలసీమ ప్రాంతం అంటే ధైర్య సాహసాలకు పుట్టినిల్లు అని వివరిస్తూ రాబోయే రోజుల్లో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని కోరారు.రాష్ట్రంలో ఉన్న రహదారుల పరిస్థితిని #JSPforAP_Roads, ద్వారా #SaveVizagSteelPlant, #Raise_Placards_Ysrcp_MP కార్యక్రమాల #విశాఖఉక్కుఆంధ్రుల_హక్కు అనే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఉన్న సమస్యలను సోషియల్ మీడియా ద్వారా దేశంలో కోట్ల మంది ప్రజలకు తెలిసేలా చేశామని ఇదే విధంగా పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు అందరూ సిద్దంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం అనంతపురం జిల్లా నాయకులతో, కార్యకర్తలతో, జనసైనికులతో, వీరమహిళలతో, కలిసి యోగక్షేమాలు కనుక్కున్నారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ T.C వరుణ్, ఉపాధ్యక్షులు శ్రీ కుంటిమద్ది జయరామ్, శ్రీ అంకె ఈశ్వరయ్య, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ భవానీ రవికుమార్, జిల్లా జనసేన పార్టీ ఇంచార్జులు శ్రీ భైరవ ప్రసాద్, సాకే పవన్ కుమార్, సాకే మురళి కృష్ణ, ఆకుల ఉమేష్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శులు అబ్దుల్, పత్తి చలపతి, సంయుక్త కార్యదర్శులు, అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం బాల సముద్రం నుంచి గెలిచిన ఎంపీటీసీ అమర్ కార్తికేయ పాల్గొనడం జరిగింది.